Walls raised on Tamil Nadu-Andhra border (Photo-Twitter)

Chennai, April 27: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ లాక్ డౌన్ (lockdown) కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు (Tamil Nadu) అధికారులు ఏపీ బార్డర్ క్లోజ్ చేశారు.  అధికారుల అత్యుత్యాహానికి ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి.  కరోనావైరస్ లాక్డౌన్ మధ్య వాహనాల రాకపోకలను ఆపడానికి తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో (Tamil Nadu-Andhra Border) రోడ్లపై 7 అడుగుల ఎత్తు వరకు గోడలు కట్టింది.

చిత్తూరు-తిరుత్తణి మార్గంలో శెట్టింతంగాళ్‌ దగ్గర, అలాగే బొమ్మసముద్రం దగ్గర నేషనల్ హైవేపై.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి గుడియాత్తానికి వెళ్లే దారిలో.. రోడ్డుకు అడ్డంగా తమిళనాడు అధికారులు సిమెంటు గోడలు కట్టించారు. ఇలా మూడు చోట్ల రోడ్లపై గోడలు కట్టడం పలు విమర్శలకు గురిచేస్తుంది. ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదు, 1177 కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 31 మంది మృతి, కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా క్వారంటైన్‌కే..

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టిన ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమైన రహదారుల్లో ఇలా గోడలు కట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ గోడలు కట్టడంపై ఏపీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. పలమనేరు ఎమ్మార్వో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

Here's wall Video

ఇదిలా ఉంటే చెక్‌పోస్టుల వద్ద వాహనాల సరుకును మాత్రమే మార్చుకోవాలని వాహనాలు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి వీలు లేదని వేలూరు కలెక్టర్‌ షణ్ముగ సుంద్రమ్‌ తెలిపారు. చిత్తూరు జిల్లా నుంచి వెలూరుకు వచ్చే వారు తప్పని సరిగా చెక్‌పోస్టుల వద్ద ఉన్న వైద్య శిబిరంగా ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ 19 కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

తమిళనాడు అధికారులతో ఏపీ అధికారులు మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో తమిళనాడు అధికారులు ఇలా గోడలు కట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమిళనాడులో ఏపీ కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి.

కాగా సరిహద్దు ప్రాంతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి మరియు అవసరమైన సేవలను మినహాయించి వాహనాల కదలికను అనుమతించలేదు. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రెండూ చోట్ల ఇప్పటివరకు వెయ్యికి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 1,885 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఆంధ్రప్రదేశ్ 1,177 గా ఉంది.