Newdelhi, July 26: భారత్ (India) లో నాసిరకం దగ్గు మందులు (Cough Syrup Quality Tests) తయారవుతున్నాయి. భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్ లు నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ దగ్గు మందుల్లోని కొన్ని నమూనాల్లో డైథిలిన్ గ్లైకాల్(డీఈజీ), ఇథిలిన్ గ్లైకాల్(ఈజీ) వంటి విష పదార్థాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది. డీఈజీ, ఈజీ, అస్సే, మైక్రోబియాల్ గ్రోత్, పీహెచ్, వాల్యూమ్ వంటి అంశాల కారణంగా ఆయా సిరప్ లకు సంబంధించిన 300 బ్యాచ్ లను నాణ్యతా ప్రమాణాలు లేని వాటిగా నివేదిక తేల్చింది.
Cough syrup samples from over 100 pharmaceutical units in the country did not pass quality tests, as per a recent report by the Central Drugs Standard Control Organisation’s (CDSCO).https://t.co/k3Nc8aarZJ
— Gorky Dhivakar - LEFT Entertainment 👁️ (@dhivaka_gorky) July 25, 2024
టెస్టులు చేయడానికి కారణం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా 141 మంది చిన్నారుల ఆరోగ్య సమస్యలతో మరణించారు. అయితే, భారత్ లో ఉత్పత్తి అయిన దగ్గు మందులను వినియోగించడంతోనే వీళ్లు మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్ లు దేశవ్యాప్తంగా ఈ మందులపై టెస్టింగ్ లు చేపట్టాయి.