Newdelhi, Sep 6: అమెరికా (America) జారీ చేసే గ్రీన్ కార్డు(US Green Card) అందుకోకుండానే సుమారు నాలుగు లక్షల మంది భారతీయులు (Indians) ప్రాణాలు విడిచే అవకాశాలు ఉన్నట్లు అమెరికాకు చెందిన క్యాటో ఇన్స్ టిట్యూట్ నివేదిక లో వెల్లడైంది. అమెరికా ఎంప్లాయిమెంట్ ఆఫీసు వద్ద గ్రీన్ కార్డు కోసం సుమారు 11 లక్షల మంది భారతీయుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే వారందరికీ ఇప్పట్లో కార్డు అందడం అసాధ్యంగా కనిపిస్తోంది. అమెరికా ఎంప్లాయిమెంట్ శాఖ వద్ద మొత్తం 18 లక్షల గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, దాంట్లో 63 శాతం దారఖాస్తులు భారతీయులవే అని తెలుస్తోంది. వీటికి తోడు ఫ్యామిలీ సిస్టమ్ తో లింకు ఉన్న గ్రీన్ కార్డులు సుమారు 83 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Over 4 Lakh Indians Will Die Waiting For US Green Card, Says Study https://t.co/OdUJB4I7mx pic.twitter.com/RHUXVSIipI
— NDTV (@ndtv) September 6, 2023
India G20 Summit: జీ-20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. పూర్తి వివరాలు ఇవే!
వెయిటింగ్ అనేది ఓ జీవితకాల శిక్ష
క్యాటో ఇన్స్‌టిట్యూట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. కొత్తగా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులకు.. వెయిటింగ్ అనేది ఓ జీవితకాల శిక్షగా మారనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆ శాఖ వద్ద ఉన్న దరఖాస్తుల్ని క్లియర్ చేయాలంటే దాదాపు 134 ఏళ్లు పడుతుందట. ఇక సుమారు 4,24,000 మంది గ్రీన్ కార్డు కోసం ఎదురూచూస్తూ తమ ప్రాణాల్ని కోల్పోయే ప్రమాదం ఉందని, దీంట్లో 90 శాతం మంది భారతీయులే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.