Karachi, Sep 19: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానంలో ఓ ప్యాసింజర్ నానా హంగామా (Passenger Creates Ruckus) చేశాడు. విమానం గాల్లో ఎగురుతుండగా ఫ్లైట్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విమానం సీట్లు, విండోను పగులగొట్టేందుకు (He Punches Seats and Kicks Windows) ప్రయత్నించాడు.
ఈ నెల 14న పీకే-283 విమానం పాకిస్థాన్‌లోని పెషావర్ నుంచి దుబాయ్‌కు వెళుతున్న విమానం (Peshawar-Dubai Flight) గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు విమానం మధ్యలో ఉన్న దారిలో బోర్లా పడుకున్నాడు. గమనించిన విమాన సిబ్బంది అతడ్ని పైకి లేపి సీటులో కూర్చోవాలని సూచించారు.
ఇది నచ్చని ఆ వ్యక్తి విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. సీట్లను చేతితో పంచ్ చేశాడు. ఇంకా దురుసుగా విమానం కిటికీ అద్దాన్ని కాళ్లతో గట్టిగా కొట్టి పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడి తీరుపై విమానంలోని మిగతా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రయాణికులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు నిబంధనల మేరకు ఫ్లైట్ సిబ్బంది ఆ వ్యక్తిని ఒక సీటుకు కట్టేశారు.
Here's Video
#Video A passenger created extreme trouble on a Pakistan International Airlines (PIA) Peshawar-Dubai PK-283 flight as he suddenly started punching seats and kicking the aircraft’s window. pic.twitter.com/bUZ0ZTVNxw
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) September 19, 2022
అనంతరం ఫ్లైట్ కెప్టెన్ దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు విషయం వివరించి.. తమ విమానం వద్దకు సెక్యూరిటీని పంపాలని కోరారు. దీంతో ఆ విమానం దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) సంస్థ ఆ ప్రయాణికుడ్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.