Doctors Successfully Remove 55 Batteries From Woman’s Gut And Stomach (Photo-Twitter)

ఐర్లాండ్‌ దేశంలో డబ్లిన్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ డిప్రెషన్‌తో తనకు తాను హాని చేసుకోవాలని భావించి 55 AA మరియు AAA బ్యాటరీలను మింగేసింది. అవి ఆమె కడుపు, పేగుల్లో చిక్కుకోవడంతో నొప్పిని తట్టుకోలేక తర్వాత లబోదిబోమంటూ ఆస్పత్రికి పరుగులు పెట్టింది. దీంతో వైద్యులు ఆపరేషన్‌ చేసి ఆ బ్యాటరీలను (Doctors Successfully Remove 55 Batteries) తొలగించారు. ఇంత పెద్ద సంఖ్యలో బ్యాటరీలను సర్జరీ ద్వారా తొలగించడం ఇదే తొలిసారి అని డాక్టర్లు తెలిపారు.

ఐరిష్ మెడికల్ జర్నల్ గురువారం ప్రచురించిన నివేదిక ప్రకారం 66 ఏళ్ల మహిళ తనకు తాను హాని తలపెట్టుకోవాలని భావించింది. ఏఏ, ఏఏఏ సైజు బ్యాటరీలు 55 మింగింది. అవన్నీ ఆమె కడుపులో, పెద్ద, చిన్న పేగుల్లో ఇరుక్కున్నాయి.అయితే కొంత సేపటికి అవి పనిచేయడంతో బాధితురాలు నొప్పితొ విలవిలలాడిపోయింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు డబ్లిన్‌లోని సెయింట్ విన్సెంట్స్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తరలించారు.

హిజాబ్‌ను తగలబెట్టిన మహిళలు, దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండంటూ పోలీసులకు సవాల్, ఇరాన్‌లో మోరల్‌ పోలీసింగ్‌పై తిరగబడిన మహిళా లోకం

అక్కడి వైద్యులు ఎక్స్‌ రే తీయగా ఆమె పొత్తి కడుపు, పేగుల్లో (Woman’s Gut And Stomach ) చిన్న సైజు బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. అయితే అదృష్టవశాత్తు ఆ బ్యాటరీల వల్ల ఆమె జీర్ణకోశం దెబ్బతినలేదని వైద్యులు చెప్పారు. పొత్తు కడుపు వద్ద సర్జరీ చేసిన వైద్యులు తొలుత 46 బ్యాటరీలు తొలగించారు. పెద్ద పేగు, చిన్న పేగుల్లో ఇరుకున్న బ్యాటరీలను ఇతర వైద్య విధానాల ద్వారా బయటకు తీశారు.