Jaipur, Febuary 29: విమానాలను పక్షులు ఢీకొని ప్రమాద ఘటనలు తరచూ జరుగుతుంటాయి. కానీ సాక్షాత్తూ విమానం లోపలే ఓ పావురం (Pigeon Inside The Plane) రివ్వుమని ఎగురుతుండటంతో విమాన ప్రయాణికులు షాక్‌కు గురైన ఘటన అహ్మదాబాద్- జైపూర్ గో ఎయిర్ (GoAir Ahmedabad-Jaipur flight) విమానంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకెళితే..
ఎయిర్‌గోకు (GoAir flight) చెందిన జి8702 విమానం అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్లడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ పావురం విమానంలోని ప్రయాణికులను ముప్పతిప్పలు పెట్టింది. విమానం లోపలకు పావురం రావడం ఏమిటని ఆశ్చర్యపోయిన ప్రయాణికులు అనంతరం తేరుకొని దాన్ని తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు.
పావురం విమానంలోపల చక్కర్లు కొడుతుండగా దాన్ని పట్టుకునేందుకు గోఎయిర్ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు విండో క్యాబిన్ ఓపెన్ చేసి పావురాన్నిబయటకు పంపించారు. దీంతో 6.15 గంటలకు బయలుదేరాల్సిన విమానం 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి 6.45 గంటలకు జైపూర్‌కు చేరుకుంది. జైపూర్ నగర విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత దిగిన విమాన ప్రయాణికులు గోఎయిర్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Here's ANI Tweet
GoAir: Two pigeons found their way inside GoAir Ahmedabad-Jaipur flight while passengers were boarding(at Ahmedabad airport yesterday).The crew immediately shooed birds outside. Regret inconvenience caused to passengers and request airport authorities to get rid of this menace pic.twitter.com/cmh2nmVtom
— ANI (@ANI) February 29, 2020
Here's Video
Two pigeons on board Jaipur-bound GoAir flight. See what happens next. #UserGeneratedContent (@gopimaniar) pic.twitter.com/oA9afyFP65
— India Today (@IndiaToday) February 29, 2020
అప్పుడప్పుడు విమానంలోకి పక్షులు రావడం సహజమే. ఒక్కోసారి అవి అయోమయంతో చేసే పనులు విమానం క్రాష్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.