Dwaraka, Feb 25: దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెనగా పేరుగాంచిన సుదర్శన్ సేతు(Sudarshan Setu)ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాసేపటి క్రితం ప్రారంభించారు. గుజరాత్ లోని (Gujarat) ద్వారకలో (Dwaraka) నిర్మించిన ఈ బ్రిడ్జికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. బెయిట్ ద్వీపాన్ని ఓఖ్రా పోర్టుతో కలుపుతూ ఈ వంతెనను రూ.979 కోట్లతో నిర్మించారు. నాలుగు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు, వెడల్పు 27.20 మీటర్లు.
VIDEO | PM Modi inaugurates Sudarshan Setu, India's longest cable-stayed bridge that will connect Okha mainland and Beyt Dwarka island in Gujarat.
(Source: Third Party) pic.twitter.com/k6bHpv5LaG
— Press Trust of India (@PTI_News) February 25, 2024
ఎయిమ్స్ దవాఖానల ప్రారంభం కూడా
ప్రధాని మోదీ నేడు పలు ప్రారంభోత్సవాల్లోనూ పాల్గొననున్నారు. మధ్యాహ్నం రాజ్ కోట్ లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం రూ.6,300 కోట్లతో ప్రభుత్వం నిర్మించారు.