Vizag, September 11: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కెల్లా అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం (Tallest Idol Ganesh) విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ఎత్తు 89 అడుగులు (89 Feet). అయితే ఈ విగ్రహం కూలిపోయే ముప్పు ఉందంటూ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని రోజూ వేలాదిగా దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే విగ్రహం ఎడమవైపు ఒక అడుగు మేర పక్కకి ఒరిగిపోయినట్టు గుర్తించారు. దాంతో, విగ్రహాన్ని పరిశీలించాలని పోలీసులు ఆర్ అండ్ బి అధికారులను కోరారు. విగ్రహాన్ని పరీక్షించిన ఆర్ అండ్ బి అధికారులు (R&B Officials) ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయంటూ తమ నివేదికలో స్పష్టం చేశారు.

వావ్! గణేశుడి లడ్డూ వేలంలో ఆల్‌టైం రికార్డు!.. రూ.46 ల‌క్ష‌లు ప‌లికిన అల్వాల్ వినాయ‌కుడి ల‌డ్డూ! తెలుగు రాష్ట్రాల్లో వినాయ‌కుడి ల‌డ్డూ వేలం ధ‌ర‌ల్లో ఇదే అత్య‌ధికం

ఈ నేపథ్యంలో, వినాయక విగ్రహాన్ని వెంటనే నిమజ్జనం చేయాలని పోలీసులు మండపం నిర్వాహకులకు సూచించారు. అయితే, ముందస్తు నిమజ్జనానికి నిర్వాహకుల కమిటీ అంగీకరించలేదు. ఈ నెల 18న నిమజ్జనం చేస్తామని నిర్ణయించింది. దాంతో, విగ్రహానికి 100 మీటర్ల లోపు ఎవరినీ అనుమతించవద్దని పోలీసులు తాజా హెచ్చరికలు చేశారు.