Mumbai, Sep 15: ముంబై (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయంలో (International Airport) గురువారం ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ప్రైవేటు జెట్ విమానం (Private Jet Plane) రన్ వే (Run Way) పై జారి పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీఎస్ఆర్ వెంచర్స్ లీర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్ విమానం విశాఖపట్నం నుంచి ముంబైకి బయలుదేరింది. ముంబైలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్ వేపై జారి, పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలైంది. విమానంలో ఉన్న ఎనిమిది మందికి స్వల్పగాయలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
A private plane (VSR Ventures Learjet 45 aircraft VT-DBL) skidded off the runway and crashed while landing at Mumbai Airport due to heavy rain.
🥺🥺🙏#MumbaiPlaneCrash #PlaneCrashLanding #planecrash #heavyrain #MumbaiAirport pic.twitter.com/kzjlH1xeFY
— Tripti / तृप्ति (@xTripti) September 14, 2023
Private Jet Veers Off Runway While Landing In Mumbai, 3 Injured https://t.co/4yUspx59j7 via @ndtv
— Ravindran Nair (@grnairravinivas) September 14, 2023
ఐదు విమానాలను మరోచోట
ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 700 మీటర్లకు మించి విజిబులిటీ లేదని డీజీసీఏ తెలిపింది. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ రన్ వేను కొద్దిసేపు మూసివేశారు. ఆ సమయంలో దిగవలసిన ఐదు విమానాలను మరోచోట దింపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు, రాజకీయ కక్షతో మోడీ నాకు పంపిన నోటీసు అని మండిపడిన కవిత