Squirrel Attack: సైకోలా మారిన ఉడుత, ఏకంగా 18 మందిని దొరికిన చోటల్లా కరుచుకుంటూ పోయింది, చివరకు దాన్ని శాశ్వత నిద్రలోకి పంపిన అధికారులు, యూకేలో ఘటన
Squirrel (Photo credits: Pixabay, skeeze)

London, Dec 31: ఉడుతలు సాధారణంగా మనుషులకు చాలా దూరంగా ఉంటాయి. అవి చూడటానికి చాలా ముద్దుగా ఉన్నా మనుషులను చూడగానే అందనంత దూరం పరిగెత్తుతాయి. ఏవైనా గింజలు దొరికితే వాటిని తిని చెట్ల మీద నివాసం ఏర్పరుచుకుని ఉంటాయి. అయితే యూకెలో ఓ ఉడుత (Rogue grey squirrel) అలా చేయలేదు. ఏకంగా రెచ్చిపోయింది. ఎవరు కనిపిస్తే వారిని కరుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటన యూకేలోని వేల్స్ దగ్గర ఉన్న బక్‌లీలో చోటు చేసుకుంది.

Stripe అనే పేరు గల ఉడత మనుషులపై దాడులకు తెగపడి సుమారు 18 మందిని (injures 18 people) గాయపరిచింది. గత వారంలో ఆ ఉడత (Psycho squirrel) సైకోలా ప్రవర్తిస్తూ రెండు రోజులు పాటు మనుషులపై దాడికి చేసిందని ఆ దేశ మీడియా పేర్కొంది. డిసెంబర్ 26న బక్లీ రెసిడెంట్స్ ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో ఉడత దాడి విషయాన్ని షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నా వేలు పైన దంతాల గుర్తులు ఉన్నాయని, నాపై దాడికి చేసిన ఉడతను వదిలించుకోవడానకి ఇబ్బందిపడ్డాను. దాని దంతాలు పిన్నుల వలే ఉన్నాయి’ అని షెరీ డేవిడ్సన్ అనే స్థానికుడు చెప్పారు.

హెయిర్ కొప్పులో బతికున్న పామును పెట్టుకుని తిరిగిన యువతి, క్లిప్ బదులు పామును చుట్టుకుని షాపింగ్ మాల్లో‌ చక్కర్లు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

అది గ్రే జాతికి చెందిన ఉడుతగా స్థానికులు పేర్కొన్నారు. ఈ జాతికి చెందిన ఉడుతలు ఎక్కువగా యూకేలోనే కనిపిస్తాయి. సైకోలా మారిన ఈ ఉడుతను కొరిన్నే రేనాల్డ్స్ అనే మహిళ ఎట్టకేలకు బంధించింది. కొద్ది రోజుల వరకు ఆమే దానికి ఆహారాన్ని అందిస్తూ వచ్చింది. రోజు తన గార్డెన్ కు వచ్చినప్పుడు అక్కడ గింజలు వేస్తే ఆ ఉడుత తిని వెళుతుండేది. అయితే ఓ సారి తన చేతుల్లో ఉన్న గింజలను తింటూ తనను కరిచి (Grey Squirrel Attack) అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఇలా 21 సార్లు దాదాపు 18 మందిని (Squirrel from hell injures 18) కరుచుకుంటూ వెళ్లింది. చివరకు ఆమే దానికి ఎరవేసి బంధించింది.

పాముతో ఆటలా.. ప్రముఖ సింగర్ గడ్డంపై కాటేసిన విషపూరిత పాము, అమెరికా గాయకురాలు మేతా పాముతో పడుకుని వీడియో తీస్తుండగా షాకింగ్ ఘటన

దాన్ని బంధించి ఇంజెక్షన్ ద్వారా శాశ్వతంగా నిద్రలోకి పోయేలా చేశారు. దీనికి కారణం ఏంటంటే యూకేలో గ్రే ఉడుతలను అడవుల్లో వదిలేయడం చట్టరీత్యా నేరం. రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. మేము ఈ ఉడుతను శాశ్వత నిద్రలోకి పంపవలసి వచ్చినందుకు చాలా విచారంగా ఉన్నాం, కానీ 2019 లో చట్టంలో మార్పుల కారణంగా బూడిద రంగు ఉడుతలను తిరిగి అడవిలోకి విడుదల చేయడం యూకేలో చట్టవిరుద్దం. మేము ఈ చట్టాన్ని అంగీకరించము అలాగని వ్యతిరేకించము, కానీ చట్టబద్ధంగా మేము కట్టుబడి ఉండాలని తెలిపారు. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఉడతలు కూడా సైకోగా మారుతాయా?’ అని కామెంట్లు చేస్తున్నారు.