
Surat, Feb 7: గుజరాత్ (Gujarat) లోని సూరత్ (Surat) కు చెందిన యతి జెఠ్వా (Yati Jethwa) అనే ఆరేళ్ల బాలుడు సూపర్ హీరో అయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 80 కిలోల బరువును సులభంగా ఎత్తుతూ వెయిట్ లిఫ్టింగులో అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాడు. ఒకటో తరగతి చదువుతున్న యతి ఇప్పటికే వెయిట్ లిఫ్టింగులో 17కు పైగా పతకాలు సాధించాడు.

డెయిలీ రొటీన్ ఇది
వండర్ బాయ్ యతి తన డెయిలీ రొటీన్ ను ఇలా వెల్లడించాడు. 'ఉదయం చదువుకుంటా. రోజూ సాయంత్రం రెండు గంటలపాటు జిమ్ లో ప్రాక్టీసు చేస్తా. ఉదయం పాలు, అరటిపండు తీసుకుంటా. మధ్యాహ్నం అన్నం, రాత్రికి చపాతీ తింటా’ అని తెలిపాడు. త్వరలో వంద కేజీలు ఎత్తాలని అనుకొంటున్నట్టు వెల్లడించాడు. వెయిట్ లిఫ్టింగులో ఈ బాలుడికి శిక్షణ ఇస్తున్నది అతడి తండ్రి రవి జెఠ్వాయే. యతికి రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ తన వెంట జిమ్‌కు వచ్చేవాడని రవి తెలిపారు.