Supreme Court takes suo motu case over of Kolkata RG Kar Hospital Doctor case

New Delhi, August 20: యవ్వనంలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ గతేడాది ఓ తీర్పు సందర్భంగా కలకత్తా హైకోర్టు (Calcutta High Court) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి విదితమే. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ వివాదాస్పద తీర్పును కొట్టివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఆ కేసులో నిందితుడికి వేసిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

రెండు నిమిషాల సుఖం కోసం చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, అమ్మాయిలు లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించిన కలకత్తా హైకోర్టు

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. గతేడాది అక్టోబరులో దీనిపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు నిర్దోషిగా తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు. యవ్వన బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలని సూచించింది.

దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేసింది. వీటిపై గతంలో విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కోర్టు సూచనలపై అసహనం వ్యక్తంచేసింది. న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదంటూ తాజా తీర్పు వెలువరించింది. నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. అతడి శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.