Screengrab Instagram

ముంబై భారీ వర్షాలలో స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఫుడ్ డెలివరీ సర్వీస్ యాప్ స్విగ్గీ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశాన్ని ఉంచింది, గుర్రంపై తమ కంపెనీ తరపున ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించడంలో ప్రజలు తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలలో, తెల్లటి గుర్రంపై స్విగ్గీ డెలివరీ బ్యాగ్‌తో స్వారీ చేస్తు ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి గుర్తింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

గుర్రంపై స్వారీ చేస్తున్న వ్యక్తి గురించిన సమాచారం అందించిన వారికి రూ. 5 వేల నజరానా కూడా ఇస్తామని తెలిపింది. “ఆ యంగ్ స్టార్ ఎవరు? ఆ స్విగ్గీ బ్యాగ్‌లో ఏముంది, భారీగా వర్షం కురుస్తున్న రోజున, రద్దీగా ఉండే ముంబై వీధుల్లో ఫుడ్ డెలివరీ చేయాలని అతను ఎందుకు నిశ్చయించుకున్నాడు. అతను ఈ ఆర్డర్‌ని డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు తన గుర్రాన్ని ఎక్కడ పార్క్ చేసాడు?" అని స్విగ్గీ తమ విజ్ఞప్తిలో పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Swiggy (@swiggyindia)

"స్విగ్గిమాన్ ఆన్ ఎ హార్స్"గురించి ఆచూకీ తెలిపిన మొదటి వ్యక్తికి రూ. 5000 బహుమతిని కూడా అందిస్తామని తెలిపింది. పర్యావరణ అనుకూలమైన డెలివరీ పద్ధతులను అవలంబించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్విగ్గి, తమ డెలివరీ వాహనాలను గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు, భర్తీ చేయడంలేదని స్పష్టం చేసింది.