Tamil Nadu: రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు, తెల్లారి చనిపోయాడనుకున్న వ్యక్తి ఇంటికి నడుచుకుంటూ వచ్చాడు, అర్థంకాక తలలు పట్టుకున్న తమిళనాడు పోలీసులు
Representational Image (Photo Credits: Twitter)

Chennai, April 6: ప్రపంచంలో అనేక వింతలు విశేషాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వాటిని మన కళ్లతో చూసినా ఒక్కోసారి నమ్మడం చాలా కష్టం. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. 55 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి చనిపోయాడని భావించి ఆదివారం సాయంత్రం అతని బంధువులు ఆ వ్యక్తికి అంత్యక్రియలు (relatives ‘buried’ his body) నిర్వహించారు. అయితే అతను అనుహ్యంగా సజీవంగా నడుచుకుంటూ ఇంటికి ( 55-year-old man returns home alive 24 hours) వచ్చాడు. దీంతో ఒక్కసారిగా బంధువులంతా షాక్‌ అయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌ సమీపంలో బనగలద్‌పూర్‌లో చోటుచేసుకుంది.

మూర్తి (55-year-old man) దినసరి కూలీ. చెరకు కోయడానికి కొన్ని రోజుల క్రితం తిరుపూర్‌ వెళ్లాడు. అయితే అతని కుమారుడు కార్తిక్‌కి.. మూర్తి ఓ బస్టాప్‌లో చనిపోయినట్లు బంధువుల నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో అతను సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి తన తండ్రేనని గుర్తించాడు కూడా. ఈ మేరకు సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అంతేగాదు ఆ మృతదేహానికి ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు కూడా. ఇదిలా ఉండగా 24 గంటల తర్వాత కార్తిక్‌ వాళ్ల నాన్న మూర్తి అనుహ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబీకులు షాక్‌ తిన్నారు.

యూపీలో దారుణం, అంబులెన్స్ లేక తోపుడు బండిపై భార్యను 3 కిలోమీటర్లు దూరంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లిన వ్యక్తి, విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం

ఈ క్రమంతో కార్తీ మాట్లాడుతూ..‘‘మా నాన్న మరణ వార్త విని చాలా షాక్‌ అయ్యాను. ఇప్పుడు అతను ఇంటికి రావడంతో తాను మరింత షాక్‌కి గురయ్యాను. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ అన్నాడు. కార్తీ ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించాడు. ఇప్పుడు పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరా? అని విచారణ చేయడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న అధికారులు శ్మశానవాటికకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను పిలిపించి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. స్థానిక తాసిల్దార్‌, రెవెన్యూ అధికారి సమక్షంలో అదే స్థలంలో శవపరీక్ష నిర్వహించారు.