Man carries wife to hospital in handcart, Dy CM orders probe (Photo: Twitter/@ikramalam7se8)

Lucknow, April 6: యూపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సకుల్‌ను.. ప్రజాపతి అనే వ్యక్తి తోపుడు బండిపై (Man carries wife to hospital in handcart) స్వయంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఆస్పత్రికు తీసుకెళ్లిన ఘటన యూపీలోని బాలియా జిల్లాలో జరిగింది. అయితే, అక్కడి డాక్టర్లు జిల్లా ఆస్పత్రికు తీసుకెళ్లాలని ప్రజాపతికి సూచించారు. జిల్లా ఆస్పత్రికు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్‌ కూడా సమకూర్చలేదని ప్రజాపతి వాపోయాడు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పతక్ అధికారులను (Dy CM orders probe) ఆదేశించారు.

వైరల్ అవుతున్న ఫోటో కథనం ప్రకారం.. మార్చి 28న జోగిని తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఫోన్‌ చేసినా ఆంబులెన్స్‌ రాలేదు. సాయం కోరినా ఎవరూ స్పందించలేదు. మరో మార్గం లేక తన బండిపై పడుకోబెట్టి 3 కి.మీ.ల దూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు ఆమెను పరీక్షించి, మందులిచ్చి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

పెంపుడు కుక్క కోసం రూ.80 వేలు ఖర్చు పెట్టి ఆలయం నిర్మించిన యజమాని, శివగంగ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలయం గురించి తెలుసుకుందామా..

ప్రజాపతి అక్కడే బండిలో తన భార్యను వదిలేసి, ఇంటికొచ్చి దుస్తులు, డబ్బు తీసుకుని తిరిగి.. కొందరిని బతిమాలి మినీ ట్రక్కులో బలియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో.. వైద్యులు చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. ఈ ఘటన వైరల్‌ కావడంతో.. ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం (Deputy Chief Minister Brajesh Pathak) విచారణకు ఆదేశించారు.

Here's Updates

దీనిపై యూపీ ప్రతిపక్షనేత అఖిలేష యాదవ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎస్పీ హయాంలో మెరుగైన వైద్యసేవలకు నిరంతరం ఖర్చు చేస్తే, నేడు బీజేపీ పాలనలో స్ట్రెచర్ లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అంబులెన్స్ ఉండి ఉంటే ఈ పోతున్న ప్రాణాలను కాపాడి ఉండేవారని క్లిప్పులతో కూడిన ట్వీట్ చేశారు.