Tamil Nadu CM Stalin: సీఎం సార్ కాపాడండి అంటూ వీడియో ద్వారా వేడుకున్న బాలిక, నేను ఉన్నానంటూ ఆ చిన్నారికి భరోసా ఇచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్
Tamil nadu CM Stalin meets a child suffering from kidney disease Photo-Video grab)

Chennai, Sep 28: సీఎం స్టాలిన్ ప్రజల్లోకి వెళుతూ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించే పనిలో బిజీ అయ్యారు తాజాగా చెన్నౌ స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో (Stanley Hospital in Chennai) రెండు కిడ్నీలు దెబ్బతిని నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను (Tamil Nadu CM Stalin) కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించారు. వీడియో వివరాల్లోకెళితే.. సేలం జిల్లా అరిసియాపాళయంకు చెందిన విజయకుమార్, రాజ నందిని దంపతులకు జనని(14) కుమార్తె పదో తరగతి చదువుతోంది.

పదేళ్ల వయస్సులోనే కర్రసాము, విలువిద్య, స్కేటింగ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించింది. 2019లో ఈ బాలిక రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు (child suffering from kidney disease) వైద్యులు తేల్చారు. దీంతో బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి తన కిడ్నీని దానం చేసింది. అయినా శస్త్రచికిత్స జరిగిన 15 రోజుల్లో తల్లి దానం చేసిన కిడ్నీ కూడా దెబ్బతింది. ప్రస్తుతం రెండు కిడ్నీలు పాడైపోవడంతో పాటుగా కాలేయం కూడా చెడిపోయింది. దీంతో తన బిడ్డ ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ తల్లి సీఎం సెల్‌ను ఆశ్రయించింది.

Here's Videos

చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో ఆ బాలికకు వైద్యానికి ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం స్టాలిన్‌ను కదిలించింది. సీఎం సార్‌, నమస్తే...రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి..రెండేళ్లుగా నరకం చూస్తున్నాను.. డయాలసిస్‌ చేస్తున్నారు ..నొప్పి భరించలేకున్నాను.. నన్ను రక్షించండి..ప్లీజ్‌ ’’ అని ఆ బాలిక పెట్టిన వీడియోతో సీఎం చలించిపోయారు. సోమవారం మంత్రులు సుబ్రమణియన్, శేఖర్‌బాబుతో కలిసి స్టాన్లీ ఆస్పత్రికి సీఎం చేరుకున్నారు. ఆ బాలికను పరామర్శించారు. మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. బాలిక తల్లి రాజనందిని ఓదార్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.

తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, అవసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన, గులాబ్‌ తుపాన్ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఈ ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్‌ కోసం వెళ్లారు.అదే సమయంలో స్థానికులు జాగింగ్‌ చేస్తూ స్టాలిన్‌కు తారసపడ్డారు. వారిని చూడగానే స్టాలిన్‌ రోడ్డుపై నిలబడి మాట కలిపారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళ.. ‘మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను, సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను, అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్‌ అయ్యాను’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ‘మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగువేస్తున్నారు..చాలా గర్వకారణంగా ఉంది’ అంటూ మరో మహిళ ప్రశంశించారు.

మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఈ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని ఇంకో మహిళ స్టాలిన్‌తో అన్నారు. ‘అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు వెళ్లిన మీ మనుమడు విజయం సాధించాలని కోరుకుంటున్నాము’ అని ఓ స్థానికుడు చెప్పడంతో సీఎం వెంటనే ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం..మార్కెండేయుల్లా ఉన్నారే’ అంటూ ఆయన గ్లామర్‌పై ఒక మహిళ చమత్కరించడంతో స్టాలిన్‌ పెద్ద పెట్టున నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు.

ప్రతి రోజూ వ్యాయామం చేస్తా, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన, ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్‌ ప్రజలతో పంచుకున్నారు. స్టాలిన్‌తో పాటు జాగింగ్‌లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్‌ చేశారు. సుమారు అర గంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటీతో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి.