Haveri, June 28: కర్ణాటకలోని (Karnataka) హవేరీ (Haveri) జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో బలంగా ఢీకొట్టడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు షిమోగా జిల్లా భద్రవతి తాలూకాలోని ఎమ్మినిహట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇదే ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొందరు భక్తులు టెంపోలో బెళగావిలోని ఆలయాలు దర్శించుకుని వస్తుండగా గుండెనహల్లి సమీపంలో పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
నార్సింగ్ హనుమాన్ గుడిలో చోరీ.. సీసీటీవీలో రికార్డు అయిన చోరీ దృశ్యాలు.. వీడియోతో
A total of 13 people were killed in a massive road accident in #Karnataka’s Haveri district https://t.co/uAXHX7qxvG
— Hindustan Times (@htTweets) June 28, 2024
టెంపోలోనే చిక్కుకున్న మృతదేహాలు
ఆగి ఉన్న లారీని పర్యాటకులు ఉన్న టెంపో వేగంగా ఢీకొట్టినట్టు ప్రమాద తీవ్రతను బట్టి అర్థమవుతున్నది. ప్రమాదంలో కొన్ని మృతదేహాలు టెంపోలోనే చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు.