New Delhi, February 18: టిక్‌టాక్ (TikTok) ఈ మధ్య చాలా ప్రమాదకరంగా తయారయింది. అందరూ ప్రమాదకరమైన స్టంట్లు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రయాణిస్తున్న రైలులో స్టంట్ చేయబోయి తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి టిక్‌టాక్ వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ (Union Railway Minister Piyush Goyal ) ట్విట్టర్లో (Twitter) ట్వీట్ చేశారు. జీవితం చాలా విలువైందని, దాన్ని ప్రమాదంలో పడేయకండని ఆయన హితవు పలికారు.
పీయూష్ గోయెల్ (Piyush Goyal) షేర్ చేసిన వీడియాలో.. ఓ వ్యక్తి ట్రైన్ బయట తలుపును పట్టుకుని ఏదో స్టంట్ చేయబోయాడు. అయితే అతడి కాలు జారి నేలకు తాకింది. అంతే ఒక్క సారిగా పట్టుకోల్పోయాడు. సెకన్ వ్యవధిలోనే చేయి కూడా జారిపోయింది. రైల్వే పట్టాలపై ఉన్న రాళ్లపై విరుచుకుపడ్డాడు. కొద్దిలో తప్పింది కానీ, లేదంటే రైలు పట్టాల కింద పడి చనిపోయేవాడు.
Tweet Shared by Piyush Goyal:
चलती ट्रेन में स्टंट दिखाना बहादुरी नही, मूर्खता की निशानी है। आपका जीवन अमूल्य है, इसे खतरे में ना डालें।
नियमों का पालन करें, और सुरक्षित यात्रा का आनंद लें। pic.twitter.com/tauidfOqRj
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) February 18, 2020
ఈ ప్రాణాంతక గేమ్ ఆడకండి, ఏ క్షణమైనా ప్రాణం పోవచ్చు
ఈ వీడియో తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన పీయూష్ గోయెల్.. ‘‘ప్రయాణిస్తున్న ట్రైన్‌లో స్టంట్ చేయడం ధైర్యానికి చిహ్నం కాదు, అది మూర్ఖత్వం. మీ జీవితం చాలా విలువైంది. దయచేసి దాన్ని ప్రమాదంలో పడేయకండి. రైల్వే నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయండి’’ అని రాసుకొచ్చారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయకూడదని హెచ్చరించారు. కదిలే రైలులో స్టంట్స్ చేయడం ధైర్యం కాదని.. అది మూర్ఖత్వమని ట్వీట్ చేశారు. మొత్తం ఏడు సెకండ్లు ఉన్న ఈ వీడియో హర్రర్ సీన్ ని తలపిస్తోంది.