Hyderabad, August 3: యావత్తు దేశం స్వాతంత్య్ర దినోత్సవ అమృత మహోత్సవాల సంబురాల్లో తెలియడుతున్నది. దేశానికి స్వాతంత్య్రం (independence) సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న శుభ సందర్భంగా నిర్వహించుకుంటున్న అమృత మహోత్సవాల వేడుక ప్రజా ఉద్యమంగా మారాలని ఇటీవలి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ (Modi) ఆకాంక్షించారు. ఈ క్రమంలో దేశ ప్రజలందరూ తమ సామాజిక మాధ్యమాల ఖాతాల ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతి ఒక్కరూ దీనిని పాటించాలన్నారు. అలాగే, ఆగస్టు 13-15 మధ్య దేశంలోని ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని మోదీ ఆకాంక్షించారు. అంతేకాదు, తన ప్రొఫైల్ (Profile) పిక్ గా జాతీయ పతాకాన్ని మోదీ పెట్టుకున్నారు. మంగళవారం నుంచి ఈ మార్పు కనిపిస్తున్నది.
ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సైతం తమ ప్రొఫైల్ పిక్ లను మార్చుకున్నారు. ఇప్పటికే చాలామంది తమ వాట్సప్, ఫెస్ బుక్, ట్విట్టర్ ఖాతాల ప్రొఫైల్ పిక్స్ లో జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. మరి మీరు? మీ సోషల్ మీడియా (Social Media) ఖాతాల కోసం కొన్ని హెచ్ డీ క్వాలిటీ పిక్స్ ను అందిస్తున్నాం. వాటిని ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని, మీ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్స్ గా పెట్టుకోండి.
HD Tiranga Profile Pictures:
Tiranga Dp For Social Media Accounts
:
Tricolour Flag Profile Picture
Indian National Flag HD Images
India's Tricolour Flag Wallpapers