Hyd, July 25: వివాహ బంధం అనేది పవిత్ర కార్యం. పాశ్చాత్య దేశాల్లో కంటే మనదేశంలో వివాహ వ్యవస్థకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రెండు కుటుంబాలు, రెండు మనసులు కలవడమే కాదు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండేదే వివాహ బంధం. అయితే అలాంటి వివాహ బంధాన్ని కొంతమంది తెలిసి, తెలియక చిన్న చిన్న విషయాలకే గొడవ పడి విడాకుల వరకు వెళ్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే దంపతులు విడాకులు కొరడానికి గల కారణాలను పరిశీలిస్తే ఎవరికైన నవ్వు రాకమానదు.
తాజాగా ప్రశాంతమైన నిద్ర కోసం విడాకులు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ విడాకులతో భయపడాల్సిన పనేమిలేదు. ఎందుకంటే ఈ చర్య వల్ల దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుందని వెల్లడైంది. ఎందుకంటే సాధారణంగా భార్యాభర్తలు ఒకే రూమ్‌లో ఒక బెడ్‌పై కలిసి నిద్రపోతారు. దంపతుల్లో ఒకరు గురక పెడితే మరొకరికి ఇబ్బంది కలుగుతుంది. దీంతో పాటు ఒకరు ఆలస్యంగా రావడం లేదా ఇద్దరు ఒకే బ్లాంకెట్ కప్పుకోవడం కారణం ఏదైనా కంటి నిండ నిద్ర ఉండదు. నిద్రలేకుంటే అది ఖచ్చితంగా వారి రోజువారి జీవన విధానంపై ఎఫెక్ట్ అవుతుంది.
అందుకే ఇప్పుడు కొత్త ట్రెండ్ నిద్ర విడాకులు తెరపైకి వచ్చింది. ఈ ట్రెండ్ ప్రకారం దంపతులిద్దరూ వేర్వేరు రూమ్‌లలో పడుకోవడం వల్ల నిద్ర పాడు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దీని వల్ల భార్య, భర్తలిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరుగుతుందని వెల్లడైంది.
అయితే భార్య,భర్తలిద్దరూ వేర్వేరుగా పడుకోవడం అనేది చాలా సున్నితమైన సమస్య. కాబట్టి ఈ ట్రెండ్ ఫాలో అయ్యే ముందు ఇద్దరు కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే భవిష్యత్‌లో ఎలాంటి గొడవలు, సమస్యలు రాకుండా ఉంటాయి. బెటర్ స్లీప్ కౌన్సిల్ సర్వే ప్రకారం నిద్రలేమి వల్ల భార్యభర్తల మధ్య దూరం పెరుగుతుందని తేలింది. ఎందుకంటే భార్య,భర్తలిద్దరూ విడివిడిగా పడుకుంటే ప్రైవసీతో పాటు పర్సనల్ స్పేస్ కూడా ఉంటుంది. అలాగే రిలేషన్‌షిప్‌లో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందనే భావన కలుగుతుంది.
కొంతమంది తమ పార్ట్‌నర్‌తో బెడ్ షేర్ చేసుకుంటే సరిగా నిద్రపోరు. గురక కానీ నిద్రలో అటూ,ఇటు బొర్లడం చిన్న,చిన్న సమస్యలే అయినా అవి పక్కవారికి ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకే వేర్వేరు బెడ్స్‌లో నిద్రపోతే ఈ సమస్యలు ఉండవు. సరిగా నిద్రపోయి, ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.
ఇది ప్రాక్టకిల్‌గా మంచి ఫలితాన్ని కూడా ఇచ్చింది. ఒక జంట ఇంటికి స్నేహితురాలు వచ్చింది. వారిద్దరూ అన్యోన్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటున్నారు. అయితే రాత్రిపూట మాత్రం భర్తతో కాకుండా వేరే గదిలో పడుకుంటోంది భార్య. ఒకరోజు అనుకోకుండా ఆమె ఇంటికి ఓ స్నేహితురాలు వచ్చింది. ఇది చూసి ఆ స్నేహితురాలు ఆశ్చర్యపోగా ఇందుకు ఆమె చెప్పిన సమాధానం మాత్రం ఖచ్చితంగా ఆలోపించ చేసింది. తాము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని కేవలం స్లీప్ డైవర్స్ మాత్రమే తీసుకున్నాం అని నవ్వుతూ చెప్పగా ఆశ్చర్యపోవడం ఆ స్నేహితురాలు వంతైంది. వాస్తవానికి ఇదే కాన్సెప్ట్‌తో కోలీవుడ్‌లో ఓ సినిమా సైతం వచ్చింది. సినిమా పేరు గుడ్ నైట్. గురక సమస్యతో భార్య,భర్తలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?, చివరికి వారి వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యలు, దీనిని అధిగమించడానికి ఆ భార్య,భర్తలు పడిన పాట్లు నేపథ్యంగా 'గుడ్ నైట్' అనే మూవీ రాగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్‌దే అగ్రస్థానం, 8వ స్థానానికి పడిపోయిన అమెరికా, 82వ స్థానంలో భారత పాస్‌పోర్ట్