యూకేలో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. మాంచెస్టర్‌కు చెందిన 22 ఏండ్ల ఒలివర్ పబ్‌కు వెళ్లేందుకు ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అనంతరం పబ్‌లో ఫ్రెండ్‌తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి తన మొబైల్‌కు 39,317 డాలర్లు (రూ.32.4 లక్షలు) క్యాబ్ బిల్లు వచ్చింది. డ్రాప్ లొకేషన్‌కు కేవలం 15 నిమిషాల వ్యవధిలో చేరుకున్నా ఇంత బిల్లు ఎందుకు వచ్చిందనేది అతడికి అర్ధం కాలేదు.
ఇలా ఎందుకు జరిగిందని కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేశాడు.సాంకేతిక సమస్యలతో డ్రాప్ లొకేషన్ అదే పేరుతో ఆస్ట్రేలియాలో ఉన్న మరో లొకేషన్ చూపించిందని దాంతోనే చిన్న రైడ్‌కే అంత బిల్లు వచ్చిందని వారు వివరణ ఇచ్చారు. ఇక ఒలివర్ ఖాతాలో అంతడబ్బు లేకపోవడంతో ఆ భారీ బిల్లు అతడి ఖాతా నుంచి డిడక్ట్ కాలేదు. డబ్బు డిడక్ట్ కాకుండా కేవలం మెసేజ్ రావడంతో బతికిపోయానని ఒలివర్ ఊపిరిపీల్చుకున్నాడు.