Newdelhi, May 20: ప్రజాస్వామ్యాన్ని (Democracy) అపహాస్యం చేస్తూ ఎన్నికల ప్రక్రియను వెక్కిరించే చర్య ఇది. నిబంధనలను అతిక్రమిస్తూ బీజేపీకి (BJP) ఏకంగా 8 మార్లు ఓటేశాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు రంజన్ సింగ్. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ వీడియో వైరల్ (Video Viral) కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. వీడియోలో రంజన్ సింగ్.. బీజేపీ అభ్యర్థి ముఖేశ్ రాజ్‌పుత్‌కి ఎనిమిది సార్లు ఓటేయడం కనిపిస్తోంది. యూపీలోని ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాజ్ పుత్ బరిలో నిలిచారు.
A boy is seen recording himself voting for a BJP candidate 8 times
This is really serious, @ECISVEEP @SpokespersonECI!#LokSabhaElections2024 #Mumbai pic.twitter.com/4qv6T397oe
— Mumbai Congress (@INCMumbai) May 19, 2024
ఈసీ కన్నెర్ర
ఈ ఘటనపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఘటన జరిగిన పోలింగ్ బూత్ లో విధులు నిర్వర్తిస్తున్న వారందరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.