Viral News (Credits: X)

Newyork, June 28: ‘కుడి ఎడమైతే, పొరపాటు లేదోయ్..’ అని ఓ సినిమాలో కవి హృదయం చెప్తుంది. అయితే, నిజ జీవితంలో మాత్రం కుడి ఎడమైతే, పొరపాటు ఉందని నిరూపించిన ఘటన ఇది. మహిళా సిబ్బందిని ‘సర్’ అని పొరపాటుగా సంబోధించినందుకు తల్లీకొడుకులను విమానం నుంచి దించేశారు. ఈ ఘటన అమెరికాలో (America) వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, టెక్సాస్‌ (Texas) కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో కలిసి ఆస్టిన్‌ కు వెళ్లేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి తమ బోర్డింగ్ పాస్ అందజేశారు. ఈ క్రమంలో జెన్నా.. మహిళా అటెండెంట్‌ ను పురుషుడిగా పొరపాటు పడి 'థ్యాంక్యూ సర్' అని సంబోధించింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ సిబ్బంది.. జెన్నాతో పాటు ఆమె తల్లి, బిడ్డను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

వీడియో ఇదిగో, వర్షంలో యువతి డ్యాన్స్ వేస్తుండగా పెద్ద శబ్దంతో పడిన పిడుగు, బిత్తరపోయి ఇంట్లోకి పరిగెత్తిన యువతి

సారీ చెప్పినప్పటికీ..

అసలేం జరిగిందో అర్థంకాని.. జెన్నా మరో సిబ్బంది సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేటు వద్దే ఆపేశారని ఫిర్యాదు చేసింది. దీంతో జెన్నాతో సదరు అటెండెంట్ బదులిస్తూ.. 'మేడం.. ఆయన కాదు ఆమె' అని బదులిచ్చారు. తప్పు తెలుసుకున్న జెన్నా తన పొరపాటును ఒప్పుకొని సారీ చెప్పినప్పటికీ ఆ మహిళా సిబ్బంది వినలేదు. దీంతో తన ఆవేదనను నెట్టింట వెళ్లబోసుకున్న జెన్నా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వార్తా వైరల్ గా మారింది.

ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఇన్నోవా కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు