Representational Image (Photo Credits: unsplash.com)

Haldwani, Nov 17: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ఒక వింత సంఘటనలో, వరుడి కుటుంబం వధువుకు 'చౌక' వెడ్డింగ్ లెహంగాను పంపడంతో వధువు తన పెళ్లిని రద్దు (Bride Calls Off Wedding) చేసుకుంది.వైరల్ ఘటన వివరాల్లోకెళితే.. రాజ్‌పురా పరిసరాల్లోని అమ్మాయికి జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. కేవలం రూ. 10,000 ఖరీదు చేసే తన పెళ్లి లెహంగాను (Groom’s Family Sends Her 'Cheap' Lehenga) వరుడి కుటుంబీకులు కొనుగోలు చేశారని తెలుసుకున్నప్పుడు, ఆమె దాని గురించి సంతోషించలేదు.

అయితే ఈ లెహంగాను తాము లక్నో నుంచి ప్రత్యేకంగా కొనుగోలు చేశామని వరుడి కుటుంబం పేర్కొంది. వీరిద్దరి పెళ్లి నవంబర్ 5న జరగాల్సి ఉంది.పెళ్లి రోజున, కోపం తెచ్చుకున్న వధువు పెళ్లికి నిరాకరించింది. వరుడి తండ్రి వధువుకు నచ్చిన లెహంగాను కొనుక్కోమని తన ఏటీఎం కార్డును ఇచ్చినప్పటికీ ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లి కొడుకు తరపువారు కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనేక గొడవల తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది.

వైరల్ క్లిప్, అచ్చం మనిషి పోలికలతో పుట్టిన మేకపిల్ల, తలపై తెల్లటిబొచ్చు గడ్డంతో పుట్టిన పిల్ల, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇక జనవరిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ వధువు సంప్రదాయం ప్రకారం తన మెడలో వేయడానికి బదులు వరుడు తనపైకి దండను విసరడంతో వధువు తన పెళ్లిని రద్దు చేసింది. బిదునా పోలీస్ సర్కిల్ పరిధిలోని నవీన్ బస్తీలో ఈ ఘటన జరిగింది. పెళ్లికి వధువు నిరాకరించడంతో ఇరు కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. వరుడు దండను విసిరేశాడనే వార్తలను పెళ్లి తరపు వారు ఖండించారు. పెళ్లి ఆచారాలను కొనసాగించమని వధువును ఒప్పించేందుకు కుటుంబీకులు ప్రయత్నించారు, కానీ ఆమె పెళ్లికి ఒప్పుకోనని మొండికేసి చెప్పేసింది. విషయం తేల్చేందుకు పోలీసులను పిలిచారు. విడిపోయే ముందు రెండు కుటుంబాలు మార్పిడి చేసుకున్న బహుమతులను తిరిగి ఇచ్చాయి.