Hyderabad, Aug 26: అదృష్టం అనేది జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది అంటారు. ఈ మహిళకు కూడా అలాగే అనుకోవచ్చు. ఈ వార్త చదివాక అదృష్టమంటే ఈమెదే అని మీరు అనకుండా ఉండలేరు. వికారాబాద్ (Vikarabad) సమీపంలోని టాకీ తండాకు చెందిన ఓ గిరిజన మహిళ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నవాంద్గి రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతున్నది. ఈ క్రమంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి అటుగా వెళ్లడానికి ప్రయత్నించింది. అప్పుడే రైలు కదిలింది.
Here's Video
వికారాబాద్ జిల్లా:
మహిళకు తప్పిన ప్రమాదం. బషీరాబాద్ మండలం నావంగి రైల్వే స్టేషన్లో అగి ఉన్న గూడ్స్ రైలు. గూడ్స్ రైలు మధ్యలో నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నం.ముగ్గురిలో ఇద్దరు దాటగా అప్పుడే కదిలిన ట్రైన్.మహిళ పట్టాల మధ్యలో ఉండడంతో అక్కడే ఉన్న మరి కొందరు ప్రయాణికులు మహిళలు పట్టాలపై… pic.twitter.com/XNXCheu2l3
— ChotaNews (@ChotaNewsTelugu) August 25, 2024
రైలు వెళ్ళేంత వరకూ..
వెంటనే అక్కడున్న వారు ఆమెను అలర్ట్ చేశారు. పట్టాలపై పడుకోవాలని సూచించారు. దీంతో ఊపిరి బిగబట్టి పట్టాల మధ్య కదలకుండా ఆమె పడుకుంది (Women lies on railway track). రైలు.. మీద నుంచి పూర్తిగా వెళ్లేంత వరకు కదలలేదు. రైలు వెళ్లిపోగానే ఊపిరి పీల్చుకున్న ఆమె.. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదేందయ్యా.. ఇది..? హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్ కు జరిమానానా? నోయిడా పోలీసుల వింత నిర్ణయం