Trump 'Real Daughter': ట్రంప్ నా తండ్రి అంటున్న పాక్ యువతి, నన్ను, మా అమ్మను పట్టించుకోవడం లేదంటూ వీడియో ద్వారా ఆవేదన, సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్న వీడియో
File Image of Donald Trump. | (Photo-ANI)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ కు కొంచెం నోటి దురుసుతనం ఎక్కువేనని చెప్పవచ్చు. దీని వల్ల ఆయన చాలా సార్లు చిక్కుల్లో పడ్డారు కూడా. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ‘నేను ఓడిపోలేదు..బైడెన్‌ గెలుపును గుర్తించను.. వైట్‌హౌజ్‌ని ఖాళీ చేయనంటూ వ్యాఖ్యలు చేసి పతాక శీర్షికలకు ఎక్కారు. తాజాగా ఈ సారి పాకిస్తాన్ యువతి ద్వారా మరోసారి వార్తలో నిలిచారు. పాక్‌ యువతి తాను ట్రంప్‌ నిజమైన కుమార్తెనని (Trump 'Real Daughter') చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో బుర్ఖా ధరించిన ఓ పాకిస్తాన్ యువతి ట్రంప్‌ ఒరిజనల్‌ కుమార్తెని నేనే (Pakistani Woman Claiming to be Donald Trump's 'Real Daughter') అంటూ ప్రకటించుకుంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను జోక్‌ చేయడం లేదు. సీరియస్‌గా మాట్లాడుతున్నాను. డొనాల్డ్‌ ట్రంప్‌ నా నిజమైన తండ్రి (Trump Ki Beti). నేను మా నాన్నని కలుసుకోవాలని భావిస్తున్నాను. ఆయన నన్ను, మా అమ్మని పట్టించుకోవడం మానేశారు. దీని గురించి మా అమ్మ, ట్రంప్‌తో గొడవపడేది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.

Here's Viral Video

వాస్తవానికి ఈ ఈ వీడియో 2018, డిసెంబరులో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.

గుండెను హత్తుకునే వీడియో, క్యాన్సర్‌ సోకిన చిన్నారి కోసం బ్యాట్‌‌మెన్‌ అవతారం ఎత్తిన డాక్టర్, బాలుడిని హత్తుకుని మహమ్మారితో ధైర్యంగా పోరాడంటూ శక్తివంతమైన మాటలు

ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరో సారి నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. తాజాగా మరోసారి వైరలవుతోంది. ఇక డొనాల్డ్‌ ట్రంప్‌కి‌ ఇవాంకా ట్రంప్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, బారన్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, టిఫనీ ట్రంప్ అంటూ ఐదుగురు సంతానం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.