Splash Water On Train (Credits: X)

Newdelhi, June 29: సరదా కోసం కొందరు చేసే పనులు.. మరికొందరిని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆకతాయిలు చేసే ఇలాంటి చేష్టలకు  ఇబ్బందిపడుతూ కొందరు తిట్టుకుంటూ పోతే, మరికొందరు తగిన బుద్ది చెప్తారు. మీ చదువబోతున్న వార్తా.. ఆ రెండో క్యాటగిరీలోనిదే.  రైలు (Train) ప్రయాణికులను భయపెట్టేందుకు పాకిస్థాన్ లోని కొందరు యువకులు ప్రయత్నించారు. కాలువ వద్ద నిలిపిన బైక్‌ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు (Splash Water On Train). రైలు ఆగదని భావించి ఎంచక్కా తమ చర్యకు సంబరపడ్డారు. చిందులేశారు. అయితే,  రైలు ఇంజిన్‌ పై నీరు పడటంతో ప్రమాదకరంగా భావించిన సిబ్బంది రైలును నిలిపారు. సిబ్బందితో పాటు ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు రైలు దిగారు.

రైతుల‌కు రుణ‌మాఫీకి రేష‌న్ కార్డుతో సంబంధం లేదు! కీల‌కవ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

బైక్‌ ను స్వాధీనం చేసుకొన్న పోలీసులు..

జరిగిన పరిణామంతో ఆకతాయిలు షాక్ అయ్యారు. పరుగులు పెట్టారు. అయితే సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు. వారిని పట్టుకొని కొట్టారు. రైలుపై నీటిని చిమ్మిన బైక్‌ ను స్వాధీనం చేసుకొన్న పోలీసులు దానిని రైలులోకి ఎక్కించారు. కొంతసేపటి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మేడిగ‌డ్డ రిపేర్ ప‌నుల‌కు బ్రేక్, ఇప్పట్లో ప‌నులు చేప‌ట్టే ప‌రిస్థితి లేదంటున్న అధికారులు