Newdelhi, Feb 11: యూపీలోని (UP) ప్రయాగరాజ్ లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక, మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఆ మార్గంలోని రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. రైలులో కాలు పెట్టేందుకూ స్థలం లేకపోవడంతో అధికారులు డోర్లు ఓపెన్ చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. ఏసీ కోచ్ విండో గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
Viral Video: Unable to Board Train to Maha Kumbh, Frustrated Devotees Break Glass Window at Madhubani Station
.
.
.#MahaKumbh #MahaKumbhTrains pic.twitter.com/5eAOUmDACG
— Republic (@republic) February 11, 2025
ఎంతో అద్భుతం
12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా లక్షలాదిగా పాల్గొంటున్నారు. కాగా, మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 45 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు పుణ్యస్నానం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు కూడా సతీసమేతంగా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం తెలిసిందే.