Hasaranga Breaks Down

Sri Lanka, AUG 26: చిన్నప్పటి నుంచి మనకళ్లముందే ఉన్న అక్కగాని, చెల్లిగాని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంటే సోదరులు తీవ్రభావోద్వేగానికి గురవుతారు. కన్నీరు పెట్టుకుంటూ మా సోదరిని కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలని బావగారిని కోరతారు. సెలబ్రెటీల ఇళ్లలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌, స్టార్‌ క్రికెటర్‌ వానిందు హసరంగ (Wanindu Hasaranga)  తన చెల్లి పెళ్లి అప్పగింతల సమయంలో చాలా ఎమోషనల్ (Hasaranga Breaks Down) అయ్యాడు. చెల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. హసరంగ చెల్లి కూడా భోరున విలపించింది. చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ హసరంగ (Hasaranga Breaks Down) తన బావపై మీద పడి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌లో హసరంగ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 30 నుంచి శ్రీలంక, పాకిస్థాన్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. ప్రస్తుతం అతడు తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని శ్రీలంక జట్టు యాజమాన్యం భావిస్తోంది.