Noida, June 16: ఐస్ క్రీమ్ (Icecream) లు తినాలంటేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. నిజమే మరి.. ముంబై (Mumbai) నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్ ఆర్డర్ (Online Order) తో తెప్పించుకున్న ఐస్ క్రీమ్ కోన్ లో మనిషి వేలిని గుర్తించిన ఘటన మరువక ముందే ఇప్పుడు ఇలాంటి మరో నిర్ఘాంతపోయే ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన దీప అనే మహిళ ఎంతో ఆశగా ఆన్ లైన్ లో ఐస్ క్రీమ్ కు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ డెలివరీ కాగానే ఐస్ క్రీమ్ తినాలని ఎంతో ఆబగా టబ్ ను తెరిచి చూసింది. అయితే, ఆ ఐస్ క్రీమ్ లో ఒక జెర్రి కనిపించింది. గడ్డకట్టి చనిపోయి ఉన్న జెర్రి మూతకు అతుక్కొని ఉండటాన్ని చూసి దీప షాక్ తిన్నది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేసింది.
Noida woman finds centipede in Amul ice cream she ordered online.
Just days back, a Mumbai resident found a human finger inside an ice cream his sister had ordered for him. pic.twitter.com/f6UfQQEcoF
— Vani Mehrotra (@vani_mehrotra) June 16, 2024
డెలివరీ సంస్థ స్పందన ఏంటంటే?
ఈ విషయం తెలుసుకున్న ఐస్ క్రీమ్ ను డెలివరీ చేసిన ప్లాట్ ఫామ్ ఆమెకు డబ్బులను తిరిగి చెల్లించింది. అయితే, ఐస్ క్రీమ్ బ్రాండ్ కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని దీప పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట్లో చర్చనీయాంశం అవుతుంది.
వాహనదారులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఏకంగా ఎంత పెంచారంటే?