మహారాష్ట్రలోని గడ్చిరోలీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.అంబులెన్సు రాకపోవడం వల్ల కన్నుమూసిన కన్నబిడ్డలను భుజాన వేసుకున్న తల్లిదండ్రులు 15 కిలోమీటర్లు నడిచి స్వగ్రామం చేరుకున్నారు. పిల్లలకు కొన్ని రోజులుగా జ్వరం రావడం వల్ల చుట్టుపక్కలవారి మాటలు నమ్మి ఆస్పత్రికి కాకుండా భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
అక్కడ చిన్నారులకు మంత్రగాడు ఏదో మూలికా ఔషధం ఇచ్చాడు. తర్వాత కొంతసేపటికే ఇద్దరు పిల్లల ఆరోగ్యం మరింత విషమించింది. స్థానిక జమిల్‌గట్ట పీహెచ్సీకి తీసుకెళ్లిన కొన్ని నిమిషాల్లోనే చిన్నారులు చనిపోయారు.అంబులెన్సు రాకపోవడంతో తల్లిదండ్రులు 15 కిలోమీటర్లు కన్నబిడ్డలను భుజాన వేసుకుని మోసారు.
Here's Heartbreaking Video
दोन्ही लेकरांचे ‘मृतदेह’ खांद्यावर घेऊन चिखलातून वाट शोधत पुढे जात असलेले हे दाम्पत्य गडचिरोली जिल्ह्यातील अहेरी तालुक्यातील आहे.
आजोळी आलेल्या दोन भावंडांना ताप आला. वेळेत उपचार मिळाले नाही. दोन तासांतच दोघांचीही प्रकृती खालावली व दीड तासांच्या अंतराने दोघांनीही अखेरचा श्वास… pic.twitter.com/ekQBQHXeGu
— Vijay Wadettiwar (@VijayWadettiwar) September 5, 2024
ఆ చిన్నారుల వయసు ఆరు, మూడు సంవత్సరాలని జమిల్‌గట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీన ఆరోగ్యం క్షీణించడం వల్ల వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. తీసుకొచ్చేదారిలోనే వారి మృతి చెందినట్లు చెప్పారు. పోస్టుమార్టం చేయాలని చెప్పినప్పటికీ, వినకుండా ఆ మృతదేహాలను తీసుకొని వెళ్లిపోయారని చెప్పారు. తర్వాత వారిని వెనక్కి రప్పించి పోస్టుమార్టం నిర్వహించినట్లు వెల్లడించారు.