Idli ATM (Twitter)

Bengaluru, October 15: భారత ఐటీ రాజధాని బెంగళూరు (Bengaluru) ఎన్నో దిగ్గజ సంస్థలకు నెలవు. ఆ నగరంలో మరెన్నో వినూత్న ఆలోచనలో అంకురాలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ చోట ఏర్పాటు చేసిన ఇడ్లీ ఏటీఎం (Idli ATM) ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రత్యేకమైన యంత్రం వీడియో (Vedio) ఇప్పుడు ట్విట్టర్‌లో (Twitter) వైరల్‌గా మారింది.  బి పద్మనాభన్ అనే వ్యక్తి  షేర్ చేసిన వీడియోలో ఇడ్లీ ఏటీఎం ఎలా పని చేస్తుందో ఓ మహిళ వివరిస్తుంది.

‘ప్రేక్షకుల్ని మోసం చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నేను కూడా మోసపోయా.. ఇదొక యానిమేటేడ్ సినిమా అని చెప్పి ఉంటే ఇన్ని ట్రోల్స్ వచ్చేవి కాదుకదా’.. ఆదిపురుష్ టీజర్‌పై మంచు విష్ణు రియాక్షన్

ఫ్రెషాట్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఇడ్లీ ఏటీఎం ఔట్ లెట్ ను చూపించడంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. లోపలికి వెళ్లిన తర్వాత క్యూఆర్ కోడ్ తో ఆర్డర్‌ ఎలా చేయాలో వివరిస్తుంది. కేవలం 50 సెకన్లలో ఇడ్లీ తయారవుతుందని, ఆకర్షణీయంగా చేసిన డబ్బాలో పార్సిల్ బయటికి వస్తుందని ఆమె చెప్పింది. రుచి కూడా బాగుందని సదరు మహిళ తెలిపింది. నెట్ లో ఈ వీడియో వైరల్ అవ్వగా.. ఇడ్లీ ఏటీఎంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొంతమంది సాంకేతికతను చూసి ఆశ్చర్యపోతే, మరికొందరు ఎక్స్ ట్రా చట్నీ  ఎలా అడుగుతారు? అంటూ ప్రశ్నలు అడుగుతున్నారు.