Man with Crocodile Costume And Teases Screen Garb From Viral video

New Delhi, DEC 09: ఫేమస్ అవ్వడం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటారు. మరికొందరు ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. మొసలిని ఆటపట్టించేందుకు మొసలి వేషం వేసిన ఒక వ్యక్తి నిజమైన మొసలిని (Wears Crocodile Costume) ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. ఆ మొసలి దగ్గరకు వెళ్లి దాని కాళ్లు పట్టుకుని పలుమార్లు లాగాడు. అయితే ఆ మొసలి పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు చేసిన ప్రమాదకర టీజ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral Video) అయ్యింది. నది ఒడ్డున ఒక మొసలి ఉంది. మొసలి వేషం ధరించిన ఒక వ్యక్తి మెల్లగా ఆ మొసలి సమీపానికి వెళ్లాడు. తన చేతులతో దాని కాలిని పట్టుకుని లాగుతూ ఆటపట్టించాడు. నరేంద్ర సింగ్‌ (Narendra Singh) అనే యూజర్‌ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో గురువారం పోస్ట్‌ చేశారు.

‘అతడు ఏం డ్రగ్స్‌ తీసుకున్నాడు?’ అని ఈ వీడియోకు శీర్షిక పెట్టారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఈ వీడియో చూసి షాకైనట్లు పలువురు పేర్కొన్నారు. ధైర్యం, మూర్ఖత్వం మధ్య సన్నని రేఖ ఉంటుందని ఒకరు విమర్శించారు. చనిపోవడానికి ఇదోక సృజనాత్మక మార్గం అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఆ మొసలి నోట కరుచుకుని నీటిలోకి తీసుకెళ్లే వరకే ఈ వినోదాలు, ఆటలు’ అంటూ మరో యూజర్‌ మండిపడ్డారు.