Kolkata, April 4: స్మగ్లరు సరికొత్త దారులను వెతుకుతూ స్మగ్లింగ్ చేస్తున్నారు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు వారి కళ్లు గప్పి స్మగ్లింగ్ చేస్తూ అక్రమ దారుల్లో ముందుకు వెళుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఓ స్మగ్లర్ చేసిన పని పోలీసులకే షాక్ కు గురి చేసింది.మాల్దా నుంచి సిలిగురికి బస్సులో వెళుతున్న వ్యక్తిని ఉత్తర బెంగాల్ యూనివర్సిటీ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి భారీగా బంగారు బిస్కెట్లను (Man arrested in Siliguri for smuggling gold biscuits) స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు తన అండర్‌వేర్‌లో రూ 1.7 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లను (worth Rs 1 crore in his underwear) దాచి అక్రమంగా తరలిస్తున్నాడని సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు వలపన్ని పట్టుకున్నారని ప్రభుత్వ న్యాయవాది రతన్ బానిక్ వెల్లడించారు. ఒక్కో బంగారు బిస్కెట్ 16 గ్రాముల బరువుందని వీటి మార్కెట్ విలువ రూ 1,71,87,640 ఉంటుందని తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరం నిందితుడిని సిలిగురి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటనపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.