Rs 3.20 lakh bill for biryani at Katwa hospital (Photo-Video Grab)

Kolkata, May 16; మహా అయితే సింగిల్ బిర్యానీ రూ. వంద నుంచి రూ. 150 ఉండొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వ‌ర‌కు ఉండొచ్చు. కానీ పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) ఓ వ్య‌క్తి భుజించిన బిర్యానీ ఖరీదు మాత్రం రూ. 3 ల‌క్ష‌లట‌. స‌ద‌రు వ్య‌క్తి ఆ బిల్లును ( Rs 3.20 lakh bill for biryani) ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి స‌మ‌ర్పించ‌డంతో.. ఈ షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది.

ఘటన వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌శ్చిమ బెంగాల్ ఈస్ట్ బ‌ర్ధామ‌న్ జిల్లాలోని క‌త్వా స‌బ్ డివిజ‌న్ ఆస్ప‌త్రికి (Katwa hospital) కింగ్ షూక్ గోష్ అనే కాంట్రాక్ట‌ర్ ఫ‌ర్నీచ‌ర్, వాహ‌నాల‌తో పాటు బిర్యానీని స‌ర‌ఫ‌రా చేస్తుంటాడు. అయితే ఇటీవ‌లే ఈ ఆస్ప‌త్రికి సౌవిక్ ఆలం అనే కొత్త సూప‌రింటెండెంట్ నియామ‌కం అయ్యారు. ఆయ‌న ముందు కాంట్రాక్ట‌ర్ రూ. కోటి విలువ చేసే బిల్లుల‌ను ఉంచాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల‌ను క్లియ‌ర్ చేయాల‌ని సూపరింటెండెంట్ అధికారుల‌ను ఆదేశించాడు.

మైనర్ బాలుడి మర్మాంగాలను తాకడం, పెదవులపై ముద్దుపెట్టడం నేరం కాదు, బాంబే హైకోర్టు సంచలన తీర్పు, ఈ కేసులో నిందితుడికి బెయిల్

అయితే సౌవిక్ ఆలం కాంట్రాక్ట‌ర్ స‌మ‌ర్పించిన బిల్లుల్లో 81 బిల్లుల‌ను బోగ‌స్‌గా గుర్తించాడు. అందులోని ఓ బిర్యానీ బిల్లు రూ. 3 ల‌క్ష‌లుగా ఉంది. దీంతో సూప‌రింటెండెంట్ షాక్ అయ్యారు. క్ష‌ణం ఆలోచించ‌కుండా పేషెంట్ వెల్ఫేర్ క‌మిటీతో సౌవిక్ ఆలం స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు.