Newdelhi, Aug 9: అందరికీ న్యాయం చెప్పే న్యాయస్థానం (Court) ప్రాంగణంలోనే ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. న్యాయం కోసం పోరాడే ఓ న్యాయవాదే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని బయటకు చెప్తే, తీవ్ర పరిణామాలు తప్పవని బాధితురాలిని హెచ్చరించి 1500 రూపాయలు ఇచ్చి పంపించి వేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని (Delhi) తీస్ హజారీ కోర్టులో జరిగింది. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న సబ్జీ మండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Woman Allegedly Raped By Lawyer In Delhi's Tis Hazari Court Chamber: Cops https://t.co/v8gPkT2GCp pic.twitter.com/XBGZddYwRD
— NDTV (@ndtv) August 8, 2024
అసలేం జరిగిందంటే?
ఉత్తర ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులోని తన చాంబర్ కు 21 ఏండ్ల ఓ మహిళను పిలిపించుకొన్న ఒక న్యాయవాది ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించి, 1500 రూపాయలు ఆమెకు ఇచ్చి పంపించివేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సదరు యువతి సబ్జీ మండీ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన