Woman Breastfeeding Cat: విమానంలో వింత ఘటన, పిల్లికి తన పాలును పట్టించిన మహిళ, ఆశ్చర్యంగా చూసిన విమాన సిబ్బంది, ప్రయాణికులు, డెల్టా ఫ్లైట్‌ 1360లో ఘటన

విమానంలో ఓ మహిళ తన పెంపుడు పిల్లికి తన పాలు ఇచ్చి సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలి డెల్టా ఫ్లైట్‌ 1360లో న్యూయార్క్‌లోని సిరక్యూస్‌ నుంచి జార్జియాలోని అట్లాంటాకు వెళుతున్నప్పుడు ఈ వింత ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, గుర్తు తెలియని మహిళ న్యూయార్క్‌లోని సిరక్యూస్ నుండి జార్జియాలోని అట్లాంటాకు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో బయలు దేరింది. విమానం ఆకాశంలో ఉండగా తన పెంపుడు పిల్లికి పాలివ్వడం ప్రారంభించింది. మిగతా ప్రయాణికులు చూడగానే ఆమె దాన్ని తన క్యారియర్ బ్యాగ్ లో పెట్టేసింది.

దాంతో సిబ్బంది ఎయిర్‌క్రాఫ్ట్ క‌మ్యూనికేష‌న్స్ అడ్ర‌సింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా గ్రౌండ్‌కు మెసేజ్ పంపించారు. ’13A సీట్లో ఉన్న ప్ర‌యాణికురాలు త‌ను పెంపుడు పిల్లికి చ‌నుబాలిస్తున్న‌ది. పాలివ్వ‌డం ఆపి పిల్లిని దాని క్యారియ‌ర్‌లో వ‌దిలేయాలంటే ఆమె విన‌డం లేదు’ అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. అంతేగాక ‘విమానం ల్యాండింగ్ త‌ర్వాత డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెడ్ కోట్ బృందంతో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రింప‌జేయండి’ అని ఆ మెసేజ్‌లో విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుతం ఈ మెసేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.