New Delhi, August 23: ఓ జొమాటో (Zomato) డెలివరీ బాయ్.. తన కూతురిని ఎత్తుకుని, కొడుకుని చేతపట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆహారం అందిస్తున్నాడు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వాని తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. పిల్లలతో కలిసి ఫుడ్ డెలివరీ చేసేందుకు రావటంపై సదరు వ్యక్తిని అడగగా.. కూతురిని ఇంట్లో వదిలేయలేక తనతో తీసుకొస్తున్నానని, తన కొడుకు డెలివరీ చేయటంలో సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘ఈ తండ్రి నిజమైన హీరో’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పాలమీగడ లాంటి నుదురు ఆమెది.. అయితే, ప్లాస్టిక్‌లా మారిపోతుంది ఎందుకు?
దీనిపై ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సైతం స్పందించింది. తమ ఉద్యోగులకు అందించే చైల్డ్ కేర్ (Childcare) ప్రయోజనాలను అందించేందుకు ఆ డెలివరీ బాయ్ (Delivery Boy) వివరాలను కోరింది.
View this post on Instagram