Hyderabad, May 23: ఉద్యోగుల కోత రిలయన్స్ గ్రూప్ (Reliance Group) లో కూడా మొదలైంది. రిలయన్స్ రిటైల్ కు చెందిన జియో మార్ట్ (Jio Mart) లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. వ్యాపార వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా లేనందున బీ2బీ వ్యాపారంలో (B2B Business) దూకుడు తగ్గించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం జియో మార్ట్ దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ తొలగింపులు ఇక్కడికి పరిమితం కావని తెలుస్తోంది. రానున్న మరికొన్ని వారాల్లో కంపెనీ 9,900 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోందని సమాచారం. ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా వ్యాపార మార్జిన్లను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంలో భాగంగా రిలయన్స్ గ్రూప్ తొలగింపుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Police Case On Dimple Hayathi: ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టి రచ్చ చేసిన హీరోయిన్ డింపుల్ హయతి.. కేసు నమోదు.. జూబ్లీహిల్స్ లో ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)