Layoffs: టీసీఎస్, ఇన్ఫోసిస్ లోనూ ఉద్యోగాల కోతలు.. మూడు నెలల్లో 11,781 మందికి ఉద్వాసన
ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి.
Hyderabad, Jan 13: గూగుల్ (Google), ఫ్లిప్ కార్ట్ (Flipkart), యూనిటీ సాఫ్ట్ వేర్, పేటీఎం, అమెజాన్ (Amazon) తదితర ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించగా ఇప్పుడు ఆ జాబితాలోకి దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రెండు కంపెనీలు ఏకంగా 11, 781 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చినట్టు పారిశ్రామికవర్గాలు తెలిపాయి. ఇందులో టీసీఎస్ 5,680 మందిపై వేటు వేయగా, ఇన్ఫీ 6,101 మందికి ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
TCS, Infosys Employee Headcount Continues to Dip, Record a Fall of Over 11,000
While TCS employee count came down by 5,680 in the third quarter of the current financial year, Infosys workforce figure reduced by 6,101 in the same period.#Labour https://t.co/u6oZZsAS42
— The Wire (@thewire_in) January 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 13, 2024 09:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

