Hyderabad, Dec 13: తన నివాసం వద్ద టీవీ9 (TV9) రిపోర్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి సదరు జర్నలిస్టుకు నటుడు మోహన్ బాబు (Mohan Babu) క్షమాపణలు చెప్పారు. ‘అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని ఓ లేఖలో పేర్కొన్నారు. 'నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారుతుందని అనుకోలేదు. తీవ్ర ఆందోళన కారణంగా నేను టీవీ9 జర్నలిస్టులను ఆవేదనకు గురి చేసినందుకు చింతిస్తున్నాను. ఆ తర్వాత నా ఆరోగ్యం బాగోలేని కారణంగా వెంటనే స్పందించ లేకపోయాను. 48 గంటల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. అందుకే ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టుకు గాయం అవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన కుటుంబానికి, టీవీ9 కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నా’ అని మోహన్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేసిన లేఖలో పేర్కొన్నారు.
తన నివాసం వద్ద జరిగిన ఉద్రిక్తతపై మోహన్‌బాబు మరోసారి స్పందించారు. ఆ ఘటనలో గాయపడిన జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెప్పారు. ‘‘అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అని లేఖలో రాసుకొచ్చారు pic.twitter.com/SLHDo5hRWJ
— ChotaNews (@ChotaNewsTelugu) December 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)