నటుడు ప్రకాశ్‌రాజ్‌ గాయాలపాలయ్యారు. చెన్నైలోని ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన లొకేషన్‌లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్‌రాజ్‌ చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందించిన ప్రకాశ్‌రాజ్‌.. సర్జరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్‌ వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)