ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు సౌత్‌లో విపరితమైన క్రేజ్‌ ఉంది. ఆయన స్టైల్‌కు, మ్యానరిజంకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతుంటారు. తరచూ కొత్త లుక్‌తో బన్నీ అభిమానులను అలరిస్తుంటాడు. పుష్ప మూవీలో తన లుక్‌, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకున్న బన్నీ తాజా లుక్‌పై నార్త్‌ నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌ లో జరుపుకోగా ఇందుకు సంబంధించిన బన్నీ లుక్‌ లీకైంది. మానవ్‌ మంగ్లాని అనే బాలీవుడ్‌ ఫొట్రోగాఫర్‌ పుష్ప 2కు సంబంధించిన అల్లు అర్జున్‌ లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

ఇందులో బన్నీ కాస్తా బొద్దుగా.. గుండ్రాలు తిరిగిన హేర్‌ స్టైల్‌తో దర్శనం ఇచ్చాడు. ఇక లావుగా తయారైన బన్నీ లుక్‌పై నార్త్‌ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘‘ వడా పావ్’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. లావెక్కాడు. క్రికెటర్‌ మలింగా లా ఉన్నాడు’, ‘ఓ మై గాడ్‌ స్టైలిష్‌ స్టార్‌కు ఏమైంది ఇలా తయారయ్యాడు, ఈయన నిజంగానే అ‍ల్లు అర్జున్‌? బాబోయ్‌ చాలా బరువెక్కాడు’’ అంటూ కొందరూ కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)