నిన్న (సోమవారం) బన్నీ ఫోటోషూట్ జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేశారు. అయితే వారిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో లాఠీఛార్జ్ జరిగింది. అందులో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనతో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నా ఫ్యాన్స్.. ఈవెంట్ కు వచ్చి గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. మా టీమ్ వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు నాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాను. మీరు నా పై చూపిస్తున్న ప్రేమే నాకు అతి పెద్ద ఆస్తి’ అని బన్నీ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)