అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. 10 వేల చదరపు అడుగుల భూమిని రూ.14.5 కోట్లకు అమితాబ్ కొనుగోలు చేశారు.

‘తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిన అయోధ్యలో భూమి కొనుగోలు చేశా. అయోధ్యలో ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద భౌగోళిక సరిహద్దులను దాటి భావొద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుంది. అయోధ్య ఆత్మలోకి ప్రయాణం ప్రారంభమైంది. సంప్రదాయం, ఆధునికత కలిగిన నగరంలోకి అడుగిడాను. ప్రపంచ ఆధ్మాత్మిక రాజధానిలో ఇల్లు నిర్మించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అమితాబ్ బచ్చన్ తెలిపారు

అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భూమి రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో ఉంటుంది. ఇక్కడినుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 30 నిమిషాల సమయం పడుతుంది. అయోధ్యలో అమితాబ్ భూమి కొనుగోలు చేయడంతో ప్రాజెక్ట్‌కు మరింత పేరు వస్తుందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Here's News

 

View this post on Instagram

 

A post shared by Hindustan Times (@hindustantimes)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)