రెబల్ హీరో ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను (Andhra pradesh Floods) ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు (AP CM Relief Fund) రూ. కోటి విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు. గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్‌ ఇండియా స్టార్‌ (Actor Prabhas) రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ. 3 కోట్లు ఇచ్చాడు. ప్రస్తుతం 'రాధేశ్యామ్' మూవీతో అభిమానులు, ప్రేక్షకులను అలరించడానికి డార్లింగ్‌ ప్రభాస్‌ రాబోతున్నాడు .

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)