ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అరున్‌ బాలి(79)కన్నుమూశారు. మస్తీనియా గ్రావిస్‌ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న బాలి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.3 ఇడియట్స్‌, పీకే వంటి హిట్‌ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించారు.ఇటీవలే విడుదలైన 'లాల్​సింగ్​ చద్దా' సినిమాలోనూ ఆయన కనిపించారు. బాలి మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేదార్‌నాథ్‌, పానిప‌ట్‌, హే రామ్, దండ్ నాయ‌క్‌, రెడీ, జ‌మీన్‌, పోలీస్‌వాలా గుండా, పూల్ ఔర్ అంగార్‌, రామ్ జానే లాంటి చిత్రాల్లోనూ కీల‌క పాత్ర‌లు పోషించారు.1991లో ప్రసారం అయిన చాణ‌క్య సిరీయ‌ల్‌లో కింగ్ పోర‌స్ పాత్ర‌లో న‌టించారు. స్వాభిమాన్ సీరియ‌ల్‌లో కున్వార్ సింగ్ రోల్ ప్లే చేశారు. నిర్మాత‌గా ఆయ‌న జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)