ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివెంజ్ డ్రామా జానర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జులై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గమనిస్తే.. "మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా... చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం" అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే, ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు.పుష్ప పాత్రలో అంజలి, ఊరిపెద్ద పాత్రలో రవీంద్రన్ విజయ్, యువ జంటగా శ్రీతేజ్, అనన్య నాగళ్ల నటించారు. చియాన్ విక్ర‌మ్ ఫ్యాన్స్ కు ఇక పండుగే! అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా తంగాల‌న్ ట్రైల‌ర్, బంగారు గ‌నుల నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ గా మూవీ

Here's Trailer

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)