బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ మంగళవారం ఉదయం విశాఖపట్నానికి చేరుకున్నారు. సెప్టెంబరు 9న విడుదలకానున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ ఈవెంట్ లో రణ్ బీర్ తో పాటు 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా పాల్గొననున్నారు. అంతకంటే ముందు.. వీరు ముగ్గురు కలిసి సింహాచలం ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన రణ్ బీర్ కుర్తా, పైజామా, సన్ గ్లాసెస్, ట్యాన్ బ్రౌన్ జూతీస్ లతో హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు. ఆయనకు అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. వాస్తవానికి 'బ్రహ్మాస్త్ర' సినిమా 2019 ఆగస్టు 15నే విడుదల కావాల్సి ఉంది. అయితే దాన్ని తొలుత 2019 క్రిస్మస్ నాటికి, ఆ తర్వాత 2020 వేసవి నాటికి వాయిదా వేశారు. కరోనా సంక్షోభ పరిస్థితుల కారణంగా సినిమా విడుదల మరోసారి నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు దాని విడుదల ముహూర్తాన్ని 2022 సెప్టెంబరు 9న ఫిక్స్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)