ఎల్‌ వీఎం3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌ 3 రాకెట్‌ విజయవంతంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. 24 రోజులపాటు భూ కక్ష్యలోనే ప్రదక్షిణ చేయనుంది. అనంతరం 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. తర్వాత చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్‌ అయి అక్కడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది.

ఈ రాకెట్‌ ప్రయోగంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. 'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్‌ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్‌ చేశాడు.

Mahesh Babu on ISRO

Mahesh Babu Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)